నిలవాలంటే గెలవాల్సిందే..బ్యాటింగ్ చేయనున్న ధోని సేన

 నిలవాలంటే గెలవాల్సిందే..బ్యాటింగ్ చేయనున్న ధోని సేన

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్  గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్  బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం  రెండు మార్పులతో బరిలోకి దిగింది. 

 


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్) రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రహానే, మోయిన్ అలీ, శివమ్ దుబే, అంబటి రాయడు, జడేజా,   దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండే, మహేష్ తీక్షణ

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : పతిరణ, సాంట్నెర్, సేనాపతి, రషీద్, ఆకాశ్

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు:  వార్నర్ (కెప్టెన్), యశ్ ధుల్, సాల్ట్, రోసో, అమన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్, సకారియా, ఖలీల్ అహ్మద్, నోకియా

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : పృథ్వీ షా, ముకేశ్ కుమార్, దూబె, రిపల్, పొరెల్