మంచిర్యాల జిల్లాలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు:​ మంచిర్యాల జిల్లాలో పలు వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంచిర్యాలకు చెందిన అంకం నరేశ్​ కొడుకు సాయి అఖిల్–​-హిమేశ్వరి దంపతులను, మందమర్రి మండలం పులిమడుగులో తిరుపతి–స్రవంతి, కాసీపేట మండలం పల్లంగూడలో మహేశ్–స్నేహశ్రీ, బెల్లంపల్లిలోని పద్మశాలి భవన్‌‌‌‌లో సాయిచందన–-సునంద్, కోటపల్లి మండలం రాంపూర్​లో మేకర్తి మహేశ్వరి–-సంతోష్ దంపతులను ఆశీర్వదించారు. చెన్నూరులో మానుష–విజయ్‌‌‌‌ ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు, మైనారిటీ షాదిఖానాలో చైతన్య–మౌనిక రిసెప్షన్‌‌‌‌కు హాజరయ్యారు.

 మందమర్రి పట్టణం అంగడిబజార్​లోని శ్రీశివకేశవ, సంజీవ ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన ఆర్చ్​ను  ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మందమర్రికి చెందిన కాంగ్రెస్ నేత బండి శంకర్‌‌‌‌‌‌‌‌ను పరామర్శించారు. మందమర్రి మండల వ్యాప్తంగా 70 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మందమర్రి తహసీల్దార్​సతీశ్ ​కుమార్, మున్సిపల్​కమిషనర్​ రాజలింగు, భీమారం పంచాయతీరాజ్​ఏఈ రాజ్‌‌‌‌కుమార్, కాంగ్రెస్ ​లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.