కాగజ్ నగర్ మండలంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిస్సా కూలీలకు విముక్తి

కాగజ్ నగర్ మండలంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిస్సా కూలీలకు విముక్తి

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం ఈస్ గాం బెంగాలీ క్యాంప్–12 శివారులో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న 24 మంది బాండెడ్ లేబర్లకు అధికారులు విముక్తి కల్పించి సొంత రాష్ట్రానికి పంపించారు. గత మూడు రోజుల క్రితం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ్​ ఇటుక బట్టీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నట్లు గుర్తించి వారిని జిల్లా కేంద్రంలోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. 

దీనిపై లోతుగా విచారణ చేపట్టి మొత్తం 24 మంది నిర్బంధ శ్రమ దోపిడీకి గురవుతున్నట్లు గుర్తించారు. వారికి విముక్తి కల్పించి, ఆదివారం సాయంత్రం రైలులో ఒడిస్సాలోని బలంగిరి జిల్లా డైతేరిముండా గ్రామానికి సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా పర్యవేక్షణలో పంపించారు. తహసీల్దార్ మధుకర్, లేబర్ ఆఫీసర్, పోలీసులు దగ్గరుండి రైలు ఎక్కించారు. 24 మందితో పాటు ఇద్దరు చిన్నారులున్నారు. బాధితులను సొంత జిల్లాలోని కలెక్టర్​కు అప్పగించి రానున్నారు.