లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో సౌర వెలుగులు..రూ.20 కోట్లతో మోడల్ విలేజ్ సోలార్ స్కీమ్

లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో సౌర వెలుగులు..రూ.20 కోట్లతో మోడల్ విలేజ్ సోలార్ స్కీమ్
  • 1160 కుటుంబాలకు సోలార్ ​కనెక్షన్లు

లక్సెట్టిపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ విలేజ్ సోలార్ స్కీమ్​లో భాగంగా లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేటలో ఆదివారం సోలార్ సిస్టంను సర్పంచ్ నలిమెల రాజు, విద్యుత్ శాఖ ఏడీఈ ప్రభాకర్, ఏఈ గణేశ్​ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే ఈ స్కీమ్​ను ప్రయోగాత్మకంగా ప్రారంభించగా.. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దత్తత గ్రామమైన వెంకట్రావుపేటను ఈ స్కీమ్ కు ఎంపిక చేశారు. 

సుమారు రూ.20 కోట్లతో 1160 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1.70 లక్షలతో  పీజీ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో సౌర ఫలకలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం కొన్నింటిని ఏర్పాటు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోన తిరుమల, కాంగ్రెస్ నాయకులు అంకతి శ్రీనివాస్, మారుతి, రమేశ్, దివ్య, మీస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.