
గోదావరిఖని, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం గోదావరిఖనిలో పర్యటించారు. చెన్నూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన మార్గమధ్యలో గోదావరిఖని బస్టాండ్‌వద్ద కాసేపు ఆగారు.
స్థానిక లీడర్లు, అభిమానులు కామ విజయ్, పాకాల గోవర్ధన్ రెడ్డి, మల్లేశ్‌యాదవ్, ఎండీ రఫీక్, తిప్పారపు మధు, జావెద్, నరేందర్‌రెడ్డి, తదితరులు ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో స్థానిక జర్నలిస్ట్ జక్కం సత్యనారాయణ కుమారుడు శివ వివాహం సందర్భంగా వివేక్ వెంకటస్వామి వారింటికి వెళ్లి ఆశీర్వదించారు.