రైతులు బాగుపడాలంటే బీజేపీని పారదోలాలి

రైతులు బాగుపడాలంటే బీజేపీని పారదోలాలి

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో   ఇండియా 101 వ స్థానంలో  ఉందన్నారు సీఎం కేసీఆర్. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతారన్నారు.కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ కళ్లు తెరవాలన్నారు. బీజేపీ హయాంలో దేశంలో ఆకలికేకలు పెరిగాయన్నారు. పాక్,బంగ్లా కంటే భారత్ లో ఆకలి కేకలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం అగ్రి చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. త్వరలో విద్యుత్ చట్టం తెచ్చి రాష్ట్ర హక్కులను కేంద్రం తీసుకోబోతుందన్నారు.  రైతులకు, సామాన్యులకు,పేదలకు రక్షణ కావాలంటే దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం పోవాలన్నారు. దేశంలో మోడీ హయాంలో  80 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. పేదరికాన్ని పెంచిందన్నారు.దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నారన్నారు.