ఇవాళ సూర్యాపేటకు సీఎం కేసీఆర్

ఇవాళ సూర్యాపేటకు సీఎం కేసీఆర్

సూర్యాపేట:ఇవాళ(ఆగస్టు 20న) సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా ఎస్పీ ఆఫీసు, బీఆర్ ఎస్ కార్యాలయంతో పాటు పలు ఆఫీసులను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెళ్లే అన్ని మార్గాలు, ప్రారంభోత్సవ ప్రదేశాలు, పబ్లిక్ మీటింగ్ వద్ద ప్రత్యేక నిఘాతో ఏర్పాటు చేశారు. తొలుత బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ ఆఫీసు, ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన సర్వీస్ రోడ్డు జనగాం x రోడ్ నుంచి - నూతన బస్టాండ్ సర్వీస్ రోడ్డును ప్రారంభించనున్నారు. అటునుంచి ఎక్స్టెన్షన్ 60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టరేట్ చేరుకుంటారు.  మధ్యాహ్నం కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమావేశం తర్వాత లంచ్ చేస్తారు. 


లంచ్ విరామం అనంతరం ఖమ్మం x రోడ్ అండర్ పాస్ నుంచి PSR సెంటర్ - జమ్మిగడ్డ - ఈనాడు ఆఫీస్ జంక్షన్,కొత్త మార్కెట్ రోడ్ మీదుగా సీఎం కేసీఆర్ ర్యాలీగా వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సమీకృత మార్కెట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి తీసుకొని.. మినీ ట్యాంక్ బండ్ మీదుగా ఎస్వీ కాలేజీ హెలీప్యాడ్ కు చేరుకుంంటారు. సాయంత్రం తిరిగా హైదరాబాద్ చేరుకోనున్నారు. 

భారీ బందోబస్తు

సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ పోలీస్ లైజన్ ఆఫీసర్గా సెక్టార్ల వారీగా ఇంచార్జ్ అధికారులను నియమించారు. మొత్తం Addl.SP లు -7, DSP లు - 24, ఇన్స్పెక్టర్ లు - 95, సబ్ ఇన్స్పెక్టర్ లు -300, ASI/HC-400, కానిస్టేబుళ్లు1300, మహిళ సిబ్బంది -130, హోమ్ గార్డ్ - 350, రోప్ పార్టీలు -6 టీమ్స్, బాంబ్ స్క్వాడ్ -8 టీమ్స్, డాగ్ స్క్వాడ్ టీమ్స్5, స్పెషల్ పార్టీ టీమ్స్,-19 టీమ్స్ లతో నిఘా ఏర్పాటు చేశారు.