మాజీ మంత్రి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి సీఎం నివాళి

మాజీ మంత్రి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి సీఎం నివాళి

జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్థివదేహానికి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నివాళులర్పించారు. దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి భౌతికకాయాన్ని సూర్యాపేటకు తరలించేకంటే ముందు సందర్శనార్థం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసంలో  ఉంచారు.  

దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోదండరెడ్డి, తదితరులున్నారు.