
జగిత్యాల: జిల్లాలోని ధరూర్ క్యాంప్ జడ్పీ హైస్కూల్లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. దసరా సెలవుల తర్వాత శనివారం (అక్టోబర్ 04) పాఠశాల రీఓపెన్ కావడంతో ఉదయం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు.
క్లాస్ రూమ్ ముందు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. గతంలోనూ ఇదే పాఠశాల వద్ద చనిపోయిన పావురానికి గంట కట్టి వదిలేశారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా ర్థులు చదువుకునే పాఠశాలలో భయాందోళన కల్గించే పనులు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
►ALSO READ | ప్రియుడి ఇంటి ఎదుట .. యువతి అనుమానాస్పద మృతి.. గద్వాల జిల్లాలో ఘటన