Janhvi Kapoor: ఇవేం సినిమాలు దేవుడో.. శ్రీదేవి కూతురితో ఇలాంటి సీన్లా..!?

Janhvi Kapoor: ఇవేం సినిమాలు దేవుడో.. శ్రీదేవి కూతురితో ఇలాంటి సీన్లా..!?

ఈ మధ్య వస్తున్న సినిమాల్లో కథ కంటే ఖతర్నాక్ సీన్లు హైలైట్ అవుతున్నాయి. హీరోయిన్ అందం ముఖంలో కాదు బాడీ షేపుల్లో కనిపించాలనే స్థాయికి కొంత మంది దర్శకులు కొన్ని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులోనూ శ్రీదేవి కూతురు అలాంటి ఎరోటిక్ సీన్లలో నటిస్తే.. అలాంటి అందాల ఆరబోత చేస్తే నెటిజన్లు ఊరికే ఉంటారా ఏంటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా.. బాలీవుడ్లో ఇటీవల విడుదలైన Sunny Sanskari Ki Tulsi Kumari (సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారీ). అక్టోబర్ 2న దసరా పండుగ రోజు విడుదలైన ఈ సినిమాలోని ఒక సన్నివేశం నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్కు ఇలాంటి సీన్లు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ సన్నివేశం ఆ రేంజ్లో చర్చకు దారితీసింది మరి.. 

ఇంతకీ అంతలా ఆ సన్నివేశంలో ఏముందంటే..
Sunny Sanskari Ki Tulsi Kumari సినిమాలో ఇద్దరు గ్లామర్ డాల్స్ నటించారు. ఒకరు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. మరొకరు ‘దంగల్’, ‘జవాన్’ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన సన్యా మల్హోత్రా. నెట్టింట వైరల్ అయిన ఈ సన్నివేశంలో ఈ ఇద్దరమ్మాయిలు ఉన్నారు. అద్దం ముందు నిల్చుని శరీరాకృతిని చూసుకుంటూ ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో పోల్చుకుంటున్న సన్నివేశం అది. 

స్త్రీ అందం అంటే.. ముఖం మాత్రమే కాదు ఇంకా చాలా అనే దర్శకుడి ఎరోటిక్ మైండ్ సెట్ నుంచి ఈ సీన్ పుట్టింది. ఈ సన్నివేశంలో గట్టిగా గాలి పీల్చుకుని ఇద్దరిలో ఎవరి అందచందాలు గొప్పగా ఉన్నాయని జాన్వీ, సన్యా పోల్చుకుని చూసుకుంటున్నారు. ఈ సీన్ చూస్తే శ్రీదేవి కూతురి మీద నిజంగా జాలేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. శ్రీదేవికి ఉన్న ఇమేజ్కు, ఆమె కూతురు జాన్వీ కపూర్ చేస్తున్న సినిమాలకు పొంతనే లేదని చెబుతున్నారు. ఇంత ఎరోటిక్గా ఉన్న సన్నివేశాలను, సినిమాలను చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీదేవి కూతురు ఉండటం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అన్ని రకాల పాత్రలు చేయాల్సిందేనని, గ్లామర్ ప్రధాన పాత్రలు కూడా చేయక తప్పదనే సంగతి అందరికీ తెలిసిందే. గ్లామర్ ప్రధాన పాత్రలు జాన్వీ కపూర్ ఇప్పటికి చాలానే చేసింది. ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో, ఉలాజ్ సినిమాలో కూడా ఆమె శృంగారభరిత సన్నివేశాల్లో ఆమె నటించింది. కానీ.. ఎప్పుడూ ఆమెపై ఈ స్థాయిలో విమర్శలు రాలేదు.

Sunny Sanskari Ki Tulsi Kumari ఆమె నటించిన ఎరోటిక్ సన్నివేశం జుగుప్సాకరంగా ఉందని ఆ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేసిన పరిస్థితి. బాలీవుడ్లో ఈ తరహా సినిమాలు, ఈ తరహా సన్నివేశాలు కొత్తేం కాదు. అక్షయ్ కుమార్ ‘హౌస్ ఫుల్’ సినిమాల కంటెంట్ మొత్తం అలాంటిదే. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు కావడం, శ్రీదేవి కూతురు ఇలా తన శరీరంలోని ఒంపుసొంపులను మరొకరితో పోల్చుకుంటూ సన్నివేశం చేయడం వల్లే ఈ సన్నివేశం ఇలాంటి చర్చకు దారితీసింది.