ప్రియుడి ఇంటి ఎదుట .. యువతి అనుమానాస్పద మృతి.. గద్వాల జిల్లాలో ఘటన

ప్రియుడి ఇంటి ఎదుట .. యువతి అనుమానాస్పద మృతి.. గద్వాల జిల్లాలో ఘటన
  • ప్రేమించి మోసం చేశాడని ఆరోపణలు
  • రెండు నెలలుగా ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష

హైదరాబాద్ : గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న యువతి ఇవాళ అను మానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక గట్టు మండలం చిన్నోనిపల్లెకు చెందిన రఘునాథ్ గౌడ్ ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం తనను పెండ్లి చేసుకోవాలని యువతి ప్రియు డిని కోరగా అతను నిరాకరించాడు. దాంతో అప్పట్లోనే ఆమె గద్వాల జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఘునాథ్ గౌడ్పై చీటింగ్ కేసు నమోదు కాగా ఆ యువకుడు జైలుకు వెళ్లి ఇటీవల విడుదల అయ్యాడు. 

అప్పటి నుంచి ప్రియాంక ఆ యువకుడి ఇంటి ఎదుటే దీక్ష కొనసాగిస్తోంది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలని మరోసారి కోరగా యువకుడు నిరాకరించడంతో ప్రియాంక పురుగుల మందు తాగింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ఆస్పత్రిలో చేర్పిం చారు. చికిత్స అనంతరం తిరిగి చిన్నోనిపల్లె గ్రామానికి చేరుకొని దీక్ష కొనసాగించిం ది. ఇవాళ ఉదయం అకస్మాత్తుగా మృతి చెందింది. రఘునాథ్ బంధువులే ప్రియాంకను చంపేశారని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

►ALSO READ | నల్గొండ జిల్లాలో విషాదం.. స్విమ్మింగ్‌ పూల్‌లో ఇద్దరు విద్యార్థులు మృతి