
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి.. అన్నీ తానై పెంచాల్సింది పోయి.. కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. తండ్రి స్థానంలో వచ్చిన వ్యక్తి కూతురిలా చూడకుండా వదిలించుకోవాల్సిన భారంలఆ చూశాడు. ఇద్దరూ కలిసి ముక్కుపచ్చలారని చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. హైదరాబాద్ మియాపూర్ లో శనివారం (అక్టోబర్ 04) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్టోబర్ ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై గాయాలను గమనించిన స్థానికులు.. ఆ గాయాల గురించి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది ఆ చిన్నారి. సవతి తండ్రితో కలిసి తన తల్లి ప్రతిరోజు కొడుతోందని, వేధింపులకు గురిచేస్తున్నారని ఏడుస్తూ చెప్పింది.
►ALSO READ | చిన్నారులను బలితీసుకుంటున్న కోల్డ్ రిఫ్ సిరప్.. తమిళనాడులో బ్యాన్.. అదే బాటలో ఇతర రాష్ట్రాలు
అభం శుభం తెలియని చిన్నారి ఒంటి పై గాయాలను చూసి తీవ్రంగా స్పందించిన స్థానికులు.. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం చిన్నారి కన్నతల్లి షబానా నాజ్విన్, సవతి తండ్రి జావేద్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చిన్నారిని మొదటగా పోలీసులు వసతి గృహానికి తరలించారు. రెండు రోజుల తర్వాత విషయం తెలిసిన చిన్నారి కన్న తండ్రి, బాబాయ్.. ఇంటికి తీసుకెళ్లారు.