
ఉత్తరప్రదేశ్ లో ఓ కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. శనివారం (అక్టోబర్ 4) జరిగిన ఈ పేలుడులో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
అందరూ క్లాస్ లలో నిమగ్నమై ఉన్న సమయంలో ఉన్నట్లుండి ఒకేసారి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కోచింగ్ సెంటర్ పూర్తిగా నేలమట్టమైంది. తీవ్రతకు భవనం పైకప్పు ఎగిరిపోగా.. చుట్టుపక్కల ఉన్న కిటికీల అద్దాలు పగిలిపోయాయి. శకలాల కింద చిక్కుకున్న విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
►ALSO READ | చిన్నారులను బలితీసుకుంటున్న కోల్డ్ రిఫ్ సిరప్.. తమిళనాడులో బ్యాన్.. అదే బాటలో ఇతర రాష్ట్రాలు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పేలుడుకు గల కారణాలను వెల్లడించారు. టాయిలెట్ స్టోరేజ్ సంపు నుంచి గాలి బయటికి రాకపోవంతో పేలుడు స్వభాగం గల గ్యాస్ ల కారణంగా పేలినట్లు తెలిపారు. ముఖ్యంగా అత్యంత పేలుడు స్వభావం కలిగిన మీథేన్ బయటికి వచ్చేందుకు వెంటిలేషన్ లేకుంటే.. అది మరింత పెరిగిపోయి పేలుడుకు కారణంగా మారుతుందని తెలిపారు. ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.