ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
  • కలెక్టర్ అభిలాష అభినవ్  

సారంగాపూర్, వెలుగు:  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు ధీటుగా మెరుగైన వైద్యం అందించాలని  కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని చించోలి ( బి) గ్రామంలో ప్రభుత్వ పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ గది, మందుల నిల్వ గది,ఇంజక్షన్ల గదిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు.

ఆసుపత్రికి రోజు వచ్చే రోగుల వివరాలు, మందుల వినియోగం, నిల్వలు, తదితర వివరాలన్నీ రిజిస్టర్లలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు .వర్షాకాలంలో రోగుల సంఖ్య పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మందులను ముందుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు.  జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్ రావు,  వైద్యాధికారి సౌమ్యతో పాటు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.