
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, రిపేర్లు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో 304 దరఖాస్తులను స్వీకరించారు. గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన గ్రౌండింగ్ 100 శాతం పూర్తి చేయాలన్నారు.
ఏఈలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్కూళ్ల రీఓపెన్ అవుతున్నందున మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అన్ని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను శుభ్రం చేయించాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాఅభివృద్ధి శాఖ మంత్రి అనసూయ (సీతక్క), సీఎస్ కె.రామకృష్ణా రావు తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీఎండబ్ల్యూవో పవన్ కుమార్, డీఈవో మొండయ్య, డీడబ్ల్యువో సరస్వతి, మెప్మా పీడీ వేణుమాధవ్ పాల్గొన్నారు.