డెంగ్యూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్

డెంగ్యూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్​ టౌన్,వెలుగు: డెంగ్యూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ​రాహుల్​రాజ్​ సూచించారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్ లో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో డెంగ్యూ వల్ల ప్రజలు ఇబ్బందిపడుకుండా ముందుగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  

జూన్ నుంచి ప్రణాళికలు సిద్ధం చేసు కొని క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు  పనిచేయాలన్నారు.  ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించి, ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. అనంతరం డెంగ్యూ నివారణ పోస్టర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో  శ్రీరామ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్​సునీత, డీసీహెచ్​వో శివదయాల్, డిప్యూటీ డీఎంహెచ్​వోలు సృజన, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

అప్రమత్తతో డెంగ్యూను నివారించవచ్చు

సంగారెడ్డి టౌన్: డెంగ్యూ వ్యాధి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసర ప్రాంతాల్లో  నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వస్తువులు, పగిలిన టైర్లలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు.  డీఎంహెచ్ వో గాయత్రీ దేవి మాట్లాడుతూ డెంగ్యూను నివారించడానికి వ్యాధి పట్ల అందరికి అవగాహన కల్పించాలని సూచించారు. .