ఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ ​చేయండి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ ​చేయండి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వీర్నపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం అందించే సాయంలో ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధిదారులకు సూచించారు.  శుక్రవారం వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మహేందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు 259 ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన మాట్లాడుతూ ఇంటి  నిర్మాణానికి అవసరమైన ఇసుకను మండల కేంద్రాలలో అందుబాటులో ఉంచుతామని, పంచాయతీ సెక్రటరీకి సమాచారం ఇస్తే ఉచితంగా సరఫరా చేస్తారన్నారు. ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి రామదాస్, మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాములు, ఎంపీడీవో అబ్దుల్ వాజిద్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముక్తార్ పాషా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.