ఫిర్యాదులు పరిశీలించి.. సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 ఫిర్యాదులు పరిశీలించి.. సమస్యలు పరిష్కరించాలి :  కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రజావాణి అప్లికేషన్లను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు జె. శ్రీనివాస్ ప్రజలనుంచి ఫిర్యాదులు  స్వీకరించారు. ప్రజావాణిలో జిల్లా అధికారులకు 41, రెవెన్యూ శాఖకు సంబంధించిన 49 వచ్చాయి. మొత్తం 90 దరఖాస్తులు  వచ్చాయన్నారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, ఇన్‌చార్జి డీఆర్‌‌ఓ అశోక్ రెడ్డి, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.

పెండింగ్ అప్లికేషన్స్‌ క్లియర్ చేయాలి

సూర్యాపేట, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లను పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్‌ నంద్‌ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.  ప్రజావాణిలో మొత్తం 67 అప్లికేషన్లు వచ్చాయని భూ సమస్యలకి సంబంధించి 19 దరఖాస్తులు, ఎంపీడీవోలకు 04, డీపీఓకి 2,  మిగిలిన 42 దరఖాస్తులు ఇతర శాఖలకి సంబంధించి వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపించారు. వాటిని వేగవంతంగా పరిష్కరించాలన్నారు. 

సోమవారం నిర్వహించిన  ప్రజావాణిలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుజూర్‌‌నగర్‌‌లో అక్టోబర్ 25న నిర్వహించిన మెగా జాబ్  మేళాను విజయవంతం చేసిన జిల్లా అధికారులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. అధికారుల కృషి ఫలితంగానే జాబ్ మేళా సక్సెస్‌ అయిందన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, ఇండస్ట్రీస్ అధికారి సీతారాం నాయక్, షెడ్యూల్ తెగల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.