కొలంబియాలో ఇండ్లపైన కూలిన విమానం

కొలంబియాలో ఇండ్లపైన కూలిన విమానం

కొలంబియాలో విమాన ప్రమాదం జరిగింది. మెడెలిన్ లోని ఓ ఇంటిపై ఫ్లైట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. విమానం ఒలాయా హెర్రెరా ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన తర్వాత ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇంజిన్ వైఫల్యంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చనిపోయిన 8 మందిలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు ఫ్లైట్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో  ఉన్నవాళ్లకు ఏమైనా గాయాలు అయ్యాయ్యా ..? అన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.