
గ్రేటర్వరంగల్, వెలుగు: జిల్లాలోని ప్రజలందరూ కమ్యూనిటీ మీడియేషన్సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబా అన్నారు. గురువారం సిటీలోని దయానంద్కాలనీ, శాయంపేట, పోతన గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను జిల్లా న్యాయమూర్తి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య, వచ్చే వివిధ రకాల తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్‌జడ్జి ఎం.సాయికుమార్, కేంద్ర మేడియేటర్కో కన్వీనర్ మల్లారెడ్డి, ఎ.రాజేంద్ర ప్రసాద్, జి.జగ్గారావు, కాలనీ వాసులు తదితరులున్నారు.