బండ్ల సేల్స్ పెరిగినా డెలివరీలో అడ్డంకులు.. దీపావళికి డెలివరీ చేసేందుకు కంపెనీల తిప్పలు

బండ్ల సేల్స్ పెరిగినా డెలివరీలో అడ్డంకులు.. దీపావళికి డెలివరీ  చేసేందుకు  కంపెనీల తిప్పలు
  • ట్రక్కుల కొరతతో ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు చేరడంలో ఆలస్యం 
  • రేర్ ఎర్త్ మెటల్స్‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌ తగ్గడంతో పడిపోయిన ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌
  • జీఎస్‌‌‌‌‌‌‌‌టీ తగ్గింపు, పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌తో జోష్‌‌‌‌‌‌‌‌లో ఆటో ఇండస్ట్రీ 

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌ మొదలవ్వడంతో బండ్ల అమ్మకాలు పుంజుకున్నాయి. కానీ,  వెహికల్ తయారీ  కంపెనీలు  మాత్రం డెలివరీ చేయడంలో  ఇబ్బంది పడుతున్నారు.  ట్రక్కులు, అలాగే ఎలక్ట్రిక్ బండ్లలో కీలకమైన రేర్ ఎర్త్ మాగ్నెట్లు కొరతవుండడంతో  బండ్ల డెలివరీ ఆలస్యమవుతోంది. దీపావళి, ధనత్రయోదశి టైమ్‌‌‌‌కి  కస్టమర్లకు  వాహనాలను  అందించేందుకు కంపెనీలు సమయంతో పోటీ పడుతున్నాయి. 

కిందటి నెల 22న కొత్త జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నుంచి  కార్లు, టూవీలర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 3.75–3.8 లక్షల వాహనాలు ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు వెళ్లాయి.  గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  ఇది  5–6శాతం అధికం. డీలర్ల దగ్గర జరిగే సేల్స్ అంటే రిటైల్ అమ్మకాలు అయితే 25శాతం వరకు పెరిగాయి.  

పండుగ ఆఫర్లు, నవరాత్రి సమయం, పన్ను తగ్గింపుల ప్రభావంతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నారు.  ఆటోమొబైల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, ఈ–-కామర్స్, ఫ్యాషన్ రంగాల్లో డిమాండ్ పెరగడంతో ట్రక్ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి నెలకొందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  “దీపావళి సమయంలో గిఫ్టింగ్ రష్ కూడా కలవడంతో, సరఫరా సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి” అని వివరించాయి.

ఇండస్ట్రీ వర్గాల మాట

మహీంద్రా అండ్ మహీంద్రా  (ఎం అండ్ ఎం) ఆటోమొబైల్ సీఈఓ నలినికాంత్ గోలగుంటా మాట్లాడుతూ, “ట్రక్కుల కొరత వల్ల డీలర్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు బండ్లను పంపడంలో ఆటంకం ఏర్పడుతోంది. వీలైనంత త్వరగా పంపకాలు మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ తగ్గడంతో మారుతి సుజుకీ చిన్న కార్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. కంపెనీ  2.5 లక్షల పెండింగ్ డెలివరీలతో బిజీబిజీగా ఉంది. 

“దీపావళి సమయానికి ఎక్కువ మంది డెలివరీ కోరుతున్నారు. అందుకే రైల్వే ద్వారా పంపకాలను వేగవంతం చేస్తున్నాం” అని కంపెనీ మార్కెటింగ్ అండ్‌‌‌‌‌‌‌‌ సేల్స్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. నవరాత్రి స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో 1.65 లక్షల రిటైల్ యూనిట్లు అమ్ముడయ్యాయని, పండుగ ముగిసే నాటికి ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 లక్షలు దాటొచ్చని ఆయన పేర్కొన్నారు.  “జీఎస్‌‌‌‌‌‌‌‌టీ తగ్గింపు తర్వాత డిమాండ్ తాత్కాలికంగా పెరిగింది. దీపావళికి ముందే డీలర్‌‌‌‌‌‌‌‌లకు వాహనాలు చేరేలా లాజిస్టిక్స్ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం” అని టాటా మోటార్స్ సీసీఓ అమిత్ కామత్ అన్నారు. 

లగ్జరీ కార్ల తయారీదారులు కూడా బండ్ల పంపిణిలో ఇబ్బంది పడుతున్నాయి. ధనత్రయోదశి, దీపావళి రోజుల్లో డెలివరీ కోరే వినియోగదారుల సంఖ్య ఈసారి ఎక్కువగా ఉందని,  ఆగస్టు–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో పెండింగ్ డిమాండ్ కూడా కలవడంతో ప్రారంభంలో లాజిస్టిక్స్ సమస్యలు ఎదురయ్యాయని బీఎండబ్ల్యూ సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు.  సమస్యలను  పరిష్కరించామని తెలిపారు.

తగ్గిన టూవీలర్ల ప్రొడక్షన్‌‌‌‌..

టూవీలర్ల  తయారీదారులు మాత్రం రేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్త్ మాగ్నెట్ల కొరతతో ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌లో  ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. “ధర తగ్గింపుతో స్కూటర్లు, బైకులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మాగ్నెట్ల కొరత వల్ల ఉత్పత్తి నెమ్మదించింది. బుకింగ్స్ పెరగడంతో డెలివరీలపై  ఒత్తిడి పెరిగింది” అని ఒక టూవీలర్  కంపెనీ అధికారి తెలిపారు. 

టీవీఎస్‌‌‌‌‌‌‌‌, బజాజ్‌‌‌‌‌‌‌‌ ఆటో, రాయల్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌  మాత్రం బాగా పెరిగాయి.  రాయల్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు కిందటి నెలలో ఏడాది లెక్కన 43శాతం పెరిగాయి. కమర్షియల్ వాహనాల్లో టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌ 16శాతం, అశోక్ లేలాండ్‌‌‌‌‌‌‌‌ 7శాతం వృద్ధిని నమోదు చేయగా, వ్యవసాయ రంగంలో మహీంద్రా ట్రాక్టర్ల సేల్స్‌‌‌‌‌‌‌‌ 50శాతం  పెరిగాయి.