టైం బ్యాడ్ : ఆ కండోమ్ ప్యాకెట్.. హంతకుడిని పట్టించింది

 టైం బ్యాడ్ : ఆ కండోమ్ ప్యాకెట్.. హంతకుడిని పట్టించింది

నేరం చేసిన వాళ్లు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడతారు.  కాని పోలీసులు ఏదో ఒక క్లూతో తీగలాగి నిందితులను పట్టుకుంటారు.  ఎంత పెద్ద నేరం చేసినా చిన్న క్లూతో పోలీసులకు చిక్కుతారు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు.. ఈ మధ్య జరిగిన ఎన్నో ఘటనలు చిన్న క్లూ తో నిజాలు తెలిసిపోయాయి.. తాజాగా జరిగిన ఓ మర్డర్ కేసును  ఒక కండోమ్ తో పోలీసులు చాక చక్యంగా చేదించారు.. . ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. 

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల లో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని  సర్కస్ కళాకారుడు అజబ్ సింగ్‌గా గుర్తించారు. అజబ్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి,  పాఠశాలకు తీసుకువచ్చి ఇక్కడి ఫర్నీచర్‌తో  మృతదేహాన్ని తగల బెట్టినట్లు గుర్తించారు. అయితే పోలీసులకు ఘటనా స్థలంలో ఎలాంటి క్లూస్ లభించలేదు. నిశితంగా పరిశీలించగా అక్కడ ఒక కండోమ్ ప్యా్కెట్ దొరికింది.  సరే ఏదో ఒకటి దొరికింది కదా అని దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ... దీంతో మరికొన్ని ఆధారాలను సేకరించారు. 

కేసులో ట్విస్ట్

 అజబ్ సింగ్‌ హత్య కేసును  కండోమ్ ప్యాకెట్  మలుపు తిప్పింది.. ఆ కండోమ్ కేసులో ట్విస్ట్ ను తీసుకొచ్చింది. జూన్ 11న, అక్బర్‌పూర్ బ్లాక్ పరిధిలోని భిత్రి దీహ్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల లో అజబ్ సింగ్ మృతదేహం కలకలం రేపింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు ఇతర ఆధారాల తో పాటు టైమెక్స్ బ్రాండ్ కండోమ్ ప్యాకెట్‌ ను స్వాధీనం చేసుకున్నారు.. నిజానికి సహరాన్‌పూర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సర్కస్‌ ఏర్పాటు చేసేందుకు ఈ గ్రామానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా ఆర్తి అనే మహిళ ఇంట్లో బస చేశారు.

అజబ్ సింగ్ హత్యకేసులో ముగ్గురు నిందితులు - ఇమ్రాన్, ఫర్మాన్ , ఇర్ఫాన్ - సహారన్‌పూర్‌కు చెందినవారు.   భిత్రి దీహ్ గ్రామంలో సర్కస్ ఏర్పాటు చేయడానికి వచ్చి  రోజుల తరబడి ఆర్తి అనే మహిళ ఇంట్లో ఉన్నారు. మ్యుజీషియన్ అయిన అజబ్ సింగ్ .. ఇమ్రాన్, ఇర్పాన్ సోదరీమణులతో వివాహేతర  సంబంధం కలిగిఉన్నాడు.  అది వారికి నచ్చలేదు.  దీంతో ఫర్మాన్, ఇమ్రాన్, ఇర్పాన్  మద్యం సేవించి అజబ్ సింగ్ తో గొడవకు దిగాడు.  అయితే  మాటా మాటా పెరగడంతో ఇమ్రాన్ తన కోపాన్ని నియంత్రించుకోలేక అజబ్ సింగ్ ను చంపాడు.  ఈ హత్య ఆర్తి అనే మహిళ ఇంట్లో జరిగింది.  మృత దేహాన్ని అక్కడి నుంచి దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లి.. అక్కడి పర్నీచర్ తో దహనం చేశారు.  అయితే ఘటనా స్థలంలో కండోమ్ ప్యాకెట్ దొరకడంతో మొదట్లో లైట్ గా తీసుకొన్నా.. దాని ఆధారంగానే నిందితులను గుర్తించారు.  ఆ ఇంటి పరిధిలో యాక్టీవ్‌గా ఉన్న మొబైల్ నెంబర్స్, కాల్స్, నెట్‌వర్క్ ఆధారంగా ఎంక్వైరీ చేశారు. హత్య అనంతరం నిందితులు ఆ ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించారు.. అసలు కారణం వివాహేతర సంబంధం అని తెలిసింది.. మొత్తానికి కేసు ఎండ్ అయ్యింది.