
నేరడిగొండ/ బజార్ హత్నూర్, వెలుగు: నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్ లో శనివారం బజార్ హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామ యాదవ సంఘం సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని, యాదవ సంఘ భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేస్తోందని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యాదవ సంఘం భవన నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జక్కుల గంగయ్య, గొర్ల నాగు రమేశ్, ఎండీ.సద్దాం తదితరులు పాల్గొన్నారు.