ఫేక్ డాక్యుమెంట్లు, హోమ్ లోన్ల పేరిట రూ. కోట్లలో కానిస్టేబుల్ ‘రియల్’ మోసాలు

ఫేక్ డాక్యుమెంట్లు, హోమ్ లోన్ల పేరిట రూ. కోట్లలో కానిస్టేబుల్ ‘రియల్’ మోసాలు
  • అతనితో పాటు మరో ఐదుగురు అరెస్ట్ .. రిమాండు
  • వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్​ వెల్లడి

వనపర్తి, వెలుగు: రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడుతూ, బ్యాంకులను, పలువురిని మోసగించిన కానిస్టేబుల్ ను, మరో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్​తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.  వనపర్తిలోని బండారునగర్ కి చెందిన బండారు రాకేశ్ కానిస్టేబుల్. కాగా అతడు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భాగంగా ఫేక్ డ్యాకుమెంట్లు సృష్టిస్తూ..  హోమ్ లోన్లు తీసుకుంటూ బ్యాంకులను మోసగిస్తున్నాడు. ఇతనికి పోతు హరీశ్​కుమార్, తాళ్లపల్లి మల్లేశ్, జి. సందీప్, బుక్క కిషోర్ కుమార్ సహకరిస్తున్నారు. పోలీసు శాఖలోని భద్రత, ఐవోబీ, హెచ్​డీఎఫ్ సీ​, ఎల్​ఐసీల్లో  హౌసింగ్ లోన్లుగా రూ.89.30లక్షలు తీసుకుని మోసగించారు. 

అదేవిధంగా కానిస్టేబుల్ మరికొందరిని మోసగించి రూ.75 లక్షలు లోన్ తీసుకున్నాడు. మొత్తంగా రూ.2. 61,89,000  కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడ్డాడు.దీంతో ఏఓ కృష్ణమోహన్​గత జనవరి 27న చేసిన ఫిర్యాదుతో కానిస్టేబుల్​ రాకేశ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఇందులో భాగంగా కానిస్టేబుల్ తోపాటు అతనికి సహకరించిన ఐదుగురిని రిమాండ్ కు పంపినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు,  వనపర్తి సీఐ ఎం. కృష్ణయ్య, పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్, సీసీఎస్ ఎస్ ఐలు రామరాజు, విజయ్ కుమార్, ఏఎస్సై రామకృష్ణ  సిబ్బంది ఉన్నారు.