భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో కూలింగ్సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. వడదెబ్బ బాధితులకు ఉపశమనం కల్పించేలా కూలింగ్ సెంటర్లలో కూలర్లు, ఫ్యాన్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలన్నారు.
ఉపాధి హామీ పని స్థలాల్లో వర్కర్ల కోసం షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతు ముంగిట శాస్త్రవేత్తల ప్రోగ్రాంలో రైతులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అనంతరం గ్రీవెన్స్‌లో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.

