స్మోకర్స్​కు కరోనా డేంజరే

V6 Velugu Posted on May 31, 2021

కరోనా వైరస్​ ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. పొగాకులోని నికోటిన్​ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. దాంతో పొగ తాగేవాళ్ల శరీరానికి కరోనావైరస్, ఇతర వ్యాధులతో పోరాడడం కష్టమవుతుంది.  కొవిడ్- పేషెంట్లకు పొగాకు ద్వారా న్యూరలాజికల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. పొగ తాగడం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్ వంటివి ఊపిరితిత్తుల్లో చేరి హిమోగ్లోబిన్‌కు అతుక్కుంటాయి. దీంతో ఆక్సిజన్‌ మోసుకుపోయే హిమోగ్లోబిన్ బలం తగ్గిపోతుంది. ఇది క్రానిక్ అబ్​స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సీఏపీడీ), క్రానిక్ బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి వ్యాధులకు దారితీస్తుంది.

పలు రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. పొగాకు వల్ల  మెదడుకి ఆక్సిజన్‌ అందించే కెరోటిడ్‌ ధమనుల్లో లేదా ఇతర రక్తనాళాల్లో రక్తం చిక్కబడుతుంది. దాంతో మెదడుకు రక్తం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. పది నిమిషాల పాటు అదే పనిగా సిగరెట్‌ తాగితే హార్ట్​బీట్30 శాతానికి పైగా పెరుగుతుంది. ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్, మయోకార్డియల్​ ఇన్​ఫ్రాక్షన్​(గుండెపోటు), స్ట్రోక్, హైపర్​టెన్షన్​కు దారితీసి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోతుంది.  
  పొగ తాగేవాళ్ల (యాక్టివ్​ స్మోకర్స్)  కంటే పొగ పీల్చేవాళ్లు (పాసివ్​ స్మోకర్స్) అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పొగ పీల్చడం వల్ల గర్భిణిల్లో అబార్షన్లు జరగడం, మృత శిశువులు జన్మించడం వంటి సమస్యలు వస్తాయి.                - అజ్మీరా డాకు నాయక్​, మహాముత్తారం, వెలుగు


పొగాకుతో కరోనా ముప్పు!
పొగాకుతో కరోనా ముప్పు  పొంచి ఉంది.  కరోనా ఎఫెక్ట్​ కూడా ఊపిరితిత్తు లపై పడుతుండడంతో ఆ పేషెంట్ల​కు ఇబ్బందులు తప్పవు. చాలామంది పొగాకుతో టీబీ, క్యాన్సర్ తదితర వ్యాధులకు గురవుతారు. ఇప్పుడు వాళ్లపై కరోనా ఎఫెక్ట్​ పడుతోంది.  -డా. వి. సుమలత ఛెస్ట్ పిజీషియన్
ధైర్యం కోల్పోవద్దు
టొబాకో అలవాటున్న వాళ్లకు కరోనా సోకితే  మనోధైర్యాన్ని కోల్పోతారు. అలాంటప్పుడు  సైకియాట్రిస్ట్​ల సాయం  తీసుకోవాలి.    -డా. ఎల్ . వరిష్,  సైకియాటిరస్ట్

Tagged doctors, corona, danger, , Smokers

Latest Videos

Subscribe Now

More News