
సీనియర్ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ (87) ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు, భార్య చెన్నమ్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నామన్నారు. తమతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా మెలిగినవారు కరోనా పరీక్షలు చేయించుకుని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
దేవెగౌడ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప ట్వీట్ చేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ వెంటనే దేవెగౌడకు ఫోన్ చేశారు.దంపతుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ ట్వీట్ చేశారు.