
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదవీ విరమణ పొందిన 73 మంది ఏసీపీలు, ఏఎస్ఐలు, పీసీలను సీపీ సీవీ ఆనంద్సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవీ విరమణ వీడ్కోలు సమావేశంలో సీపీ మాట్లాడారు. రిటైర్డ్అవుతున్న వారంతా సుదీర్ఘ కాలం పోలీసు శాఖకు సర్వీస్చేశారని, వారి సేవలు మర్చిపోలేనివన్నారు.