నవంబర్ 15న కామారెడ్డికి సీపీఐ యాత్ర బృందం రాక

నవంబర్  15న కామారెడ్డికి  సీపీఐ యాత్ర బృందం రాక

కామారెడ్డిటౌన్​, వెలుగు : సీపీఐ పార్టీ  స్థాపించి వంద ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాసర నుంచి చేపట్టిన యాత్ర  రేపు సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని ఆ పార్టీ  కామారెడ్డి జిల్లా సెక్రటరీ  ఎల్. దశరథ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొత్త బస్టాండు వద్ద సభ ఉంటుందన్నారు.  

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు   పశ్యపద్మ,   ప్రతినిధులు వలిపుల్లాఖాద్రి,   నరేంద్ర ప్రసాద్​ తదితరులు వస్తున్నారని తెలిపారు. డిసెంబర్​ 25న ఖమ్మంలో 100 ఏండ్ల ఉత్పవాల ముగింపు సభ ఉంటుందన్నారు.   యాత్రకు కామారెడ్డి ప్రజలు, ఆయా వర్గాల ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.  సమావేశంలో నాయకులు రాజమణి,  బత్తుల ఈశ్వర్​,  మల్లేష్​, ప్రవీన్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.