ప్రజా సమస్యలు పరిష్కరించాలి : జాన్ వెస్లీ

ప్రజా సమస్యలు పరిష్కరించాలి : జాన్ వెస్లీ
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.  ఆదివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని 17వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాలనీలో 600 కుటుంబాలు ఉన్నాయని, 15 సంవత్సరాలుగా, కాలనీ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

2012లో ఆనాటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిందన్నారు.  గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలనీ గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు.  కలెక్టరేట్ కూత వేటు దూరంలో ఉన్న బీసీ కాలనీ గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు పాల్గొన్నారు.