క్రికెటర్లకు కరోనా ఎలా సోకిందో  కచ్చితంగా  చెప్పలేం

క్రికెటర్లకు కరోనా ఎలా సోకిందో  కచ్చితంగా  చెప్పలేం

ట్రావెలింగ్​ ఓ కారణం  కావొచ్చు: గంగూలీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన ఐపీఎల్​ బయో బబుల్​ ఎలా బ్రేక్‌‌‌‌​ అయ్యిందో చెప్పడం కష్టమని బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరవ్​ గంగూలీ అన్నాడు. ఒకవేళ సిటీల మధ్య ప్రయాణం​ వల్లే  కరోనా వైరస్‌‌‌‌ క్రికెటర్లకు సోకి ఉండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ‘బబుల్​ ఎలా బ్లాస్ట్​ అయ్యిందో అర్థం కావడం లేదు. దానికి దారి తీసిన పరిస్థితులపై పోస్ట్​మార్టమ్​ చేస్తున్నాం. కారణాలను వెతికే పనిలో బీసీసీఐ ఉంది. బహుశా ట్రావెలింగ్​ కూడా ఓ కారణం కావొచ్చు. ఇప్పుడున్న రిపోర్ట్​ ప్రకారం బబుల్​ బ్రీచ్​ కాలేదనే తెలుస్తోంది. అయినా ప్రమాదం ఎలా జరిగిందో చెప్పడం కష్టం. కరోనా సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌లో ప్రస్తుతం  దేశంలో ఎంత మందికి ఇన్ఫెక్షన్​ సోకిందో చెప్పడం ఎంత కష్టమే ఇది కూడా అంతే. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? అలాగే పరిస్థితులు కూడా మా చేయి దాటిపోయాయి. ముంబై మ్యాచ్​లను సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​చేసే టైమ్​కు కేసుల సంఖ్య భారీగా ఉంది. అయినా మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ, ఢిల్లీ, అహ్మదాబాద్​కు మారిన తర్వాతే  తేడా వచ్చింది’ అని దాదా పేర్కొన్నాడు. 
సెప్టెంబర్​ విండోపై వర్క్​ చేస్తాం
ఐపీఎల్‌‌‌‌ 14ను పూర్తి చేయడానికి  సెప్టెంబర్​లో విండో లభించే చాన్స్​ ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటామని గంగూలీ చెప్పాడు. దీనిపై మిగతా బోర్డులతోనూ సంప్రదింపులు చేయాల్సి ఉందన్నాడు. చాలా అంశాలు ముడిపడి ఉన్న లీగ్​పై నెమ్మదిగా వర్క్​ మొదలుపెడతామన్నాడు. ఒకవేళ తాము ఐపీఎల్​ను కంప్లీట్​ చేయలేకపోతే రూ. 2500 కోట్ల వరకు నష్టం వస్తుందన్నాడు. ఇక, యూఏఈలో బయో బబుల్​ను నిర్వహించిన యూకే కంపెనీ ‘రెస్ట్రాటా’కు ఇండియాలో పని చేసిన ఎక్స్​పీరియెన్స్​ లేదన్నాడు. అందుకే వేరే కంపెనీతో కాంట్రాక్ట్​  కుదుర్చుకున్నామన్నాడు. ఇక టీ20 వరల్డ్​కప్​ను యూఏఈకి షిష్ట్​ చేసే అంశంపై ఇప్పడే స్పందించాల్సిన అవసరం లేదన్నాడు. ‘మెగా టోర్నీకి ఇంకా చాలా టైమ్​ ఉంది. అప్పటిలోగా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. దానిని బట్టే నిర్ణయాలు ఉంటాయి. షెడ్యూల్​ ప్రకారమే వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్స్​ ఉంటుంది. మన ప్లేయర్లు ఇంగ్లండ్​లో వారం రోజులు క్వారంటైన్​లో ఉంటారు’ అని దాదా వ్యాఖ్యానించాడు. క్రికెటర్ల కోసం స్పెషల్​ వ్యాక్సినేషన్​ డ్రైవ్​  ఏర్పాటు చేసే ఆలోచన బీసీసీఐకి లేదన్నాడు.