
రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఆదిలాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో నిండిపోయింది. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సోదరులకు రాఖీలు కట్టేందుకు వెళ్తున్న మహిళలు, యువతులు అధిక సంఖ్యలో తరలివచ్చి, బస్సుల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. – వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్