IPL 2024 : CSK vs RCB.. చెపాక్ లో ఏడుసార్లు హోరాహోరీ.. రికార్డులు ఇవే

 IPL 2024 : CSK vs RCB.. చెపాక్ లో ఏడుసార్లు హోరాహోరీ.. రికార్డులు ఇవే

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 పండగ వచ్చేసింది.  మార్చి 22వ తేదీ శుక్రవారం ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.  తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు సాయంత్రం 6.30 గంటలకు ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. చెన్నై- బెంగళూరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. 

కాగా,  ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు చాలాసార్లు తలపడ్డాయి.. కానీ చెపాక్ స్టేడియం  విషయానికి వస్తే.. ఇక్కడ కేవలం ఏడుసార్లు మాత్రమే హోరాహోరీగా తలపడ్డాయి.  గత 16 ఏళ్లుగా CSKపై చెపాక్‌లో RCB ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. 

RCB, CSK టీమ్స్ మధ్య రికార్డులు పరిశీలిస్తే.. గత పది సీజన్లుగా ఆర్ సీబీపై సీఎస్ కే అధిపత్యం చెలాయిస్తూ వస్తోంది.  సిఎస్ కె, ఆర్ సీబీ జట్లు 32  సార్లు తలపడగా.. చెన్నై 21 సార్లు బెంగళూరును చిత్తు చేసింది. ఈ 32 మ్యాచ్ లలో ఒక మ్యాచ్ ఛాంపియన్స్ లీగ్‌లో జరిగగా.. మిగిలిన 31 మ్యాచ్‌లు IPLలో జరిగాయి. ఇందులో CSK 20 మ్యాచ్‌లను గెలుచుకుంది.  చివరిగా 2022 సీజన్ లో బెంగళూరు, చెన్నై జట్టును ఓడించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఆరు మ్యాచ్ లల్లో  బెంగళూరు ఈ ఒక్క విజయం మాత్రమే సాధించింది.

రెండు జట్లు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో CSK కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. 2008, చెన్నైలో జరిగిన ప్రారంభ ఎడిషన్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో CSKని ఓడించింది.  అప్పటి నుంచి గత 16 సంవత్సరాలుగా CSKపై చెపాక్‌లో RCB విజయం సాధించలేకపోయింది. 

ఇక, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో కూడా చెన్నై జట్టే ఆధిపత్యం చేలాయించింది. ఇక్కడ జరిగిన 10 మ్యాచ్ లల్లో చెన్నై ఐదింట్లో విజయం  సాధించగా.. బెంగళూరు నాలుగింట్లో గెలుపొందింది.