మంచిర్యాల జిల్లాలో 3,641 ఎకరాల్లో పంట నష్టం

మంచిర్యాల జిల్లాలో  3,641 ఎకరాల్లో పంట నష్టం

మంచిర్యాల, వెలుగు: మొంథా తుఫాన్ కారణంగా మంచిర్యాల జిల్లాలో 3,641 ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సురేఖ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రిలిమినరీ సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్టు పంపించామన్నారు. 

వరి పంట బెల్లంపల్లి మండలంలో 310 ఎకరాలు, తాండూర్​లో 55, నెన్నెలలో 140, కోటపల్లిలో 401, చెన్నూర్​లో 570, జైపూర్లో 310, మందమర్రిలో 272, మంచిర్యాలలో 75, నస్పూర్​లో 75, హాజీపూర్​లో 200, దండేపల్లిలో 10, జన్నారంలో 235, లక్సెట్టిపేటలో 30, కన్నెపల్లిలో 10, వేమనపల్లిలో 120, భీమారంలో 21 ఎకరాల్లో పట్ట దెబ్బతిన్నది. పత్తి పంట చెన్నూర్​లో 584 ఎకరాలు, జైపూర్​లో 70, మందమర్రిలో 134, కన్నెపల్లిలో నాలుగు, భీమారంలో మూడెకరాల్లో నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 2,967 మంది రైతులు పంట నష్టపోయారని డీఏవో పేర్కొన్నారు.