కోహ్లీ, ధావన్ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్

కోహ్లీ, ధావన్ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో  మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో 6 వేల పరుగులు చేసిన తొలి విదేశీ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో 6వేల పరుగులు చేసిన  మూడో క్రికెటర్గా  వార్నర్ నిలిచాడు. వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లీ 6727, శిఖర్ ధావన్ 6370 పరుగులతో ఈ ఫీట్ ను అందుకున్నారు. అయితే కోహ్లీ, ధావన్ కంటే వేగంగా 6 వేల పరుగులు చేసిన బ్యాట్స్మన్గా వార్నర్ రికార్డు సాధించడం విశేషం. కోహ్లీ 188 ఇన్నింగ్స్ లలో  6 వేల పరుగులు చేస్తే..ధావన్‌  199 ఇన్నింగ్స్‌లో 6వేల రన్స్ చేశాడు. కానీ వార్నర్ మాత్రం 165 ఇన్నింగ్స్‌ల్లోనే 6 వేల పరుగులు చేయడం మరో విశేషం. 

వార్నర్ స్ట్రైక్ రేట్ ఎంతంటే..

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు 13 మంది 4 వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు. అందులో ఉత్తమ సగటు బ్యాట్స్ మన్  డేవిడ్ వార్నర్  (సగటు 42.28). అంతేకాకుండా డేవిడ్ వార్నర్ స్ట్రైక్ రేటు 140.08గా ఉంది. ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ 151.68 స్ట్రైక్ తో 4వేల పరుగులు సాధించాడు. ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ 148.96 స్ట్రైక్ రేటుతో 6వేల పరుగులు చేయడం విశేషం. 

ఒకే ఒక్కడు..

మరోవైపు ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ ఒక్కడే మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 2014 నుంచి 2020 వరకు 6 సీజన్లలో 500 కంటే ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్ మన్ గా రికార్డులకెక్కాడు. 2009లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన  డేవిడ్ వార్నర్.. ఆరంభంలో నాలు  సీజన్లు ఢిల్లీ తరపున ఆడాడు. ఆ తర్వాత 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.