
హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లకు నిర్వహించిన డీఈఈసెట్ లో ర్యాంకు పొందిన అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ శ్రీనివాస్‌చారి తెలిపారు.
ఆగస్టు 8వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర వివరాలకు http://deecet.cdse.telangana.gov.in వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.