
ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మురికి వాడల్లో ఇవాళ తెల్లవారుజాము ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, 15 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. ఈఘటనపై డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఏకే జైశ్వాల్ స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో రోబోలను కూడా వినియోగించామని, అవి సమర్ధవంతంగా పనిచేశాయన్నారు.