- డీఈవో రాజు
సదాశివనగర్, వెలుగు : చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈవో రాజు విద్యార్థులకు సూచించారు. మంగళవారం రామారెడ్డి మండల కేంద్రంలో అన్ని హైస్కూల్స్ విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాసం పోటీలు నిర్వహించగా డీఈవో హాజరై విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. రామారెడ్డి బాలికల పాఠశాలకు చెందిన సృజన క్విజ్‌లో ప్రథమ బహుమతి సాధించింది. ఉపన్యాసంలో గిద్ద ఉన్నత పాఠశాలకు చెందిన మధులిక, వ్యాస రచన లో రామారెడ్డి బాలుర పాఠశాలకు చెందిన సందీప్ విజేతలుగా నిలిచారు.
కార్యక్రమంలో ఎంఈవో అనంద్ రావు, కాంప్లెక్స్ హెచ్ఎంలు అనంద్‌రావు, గోపాల్ రెడ్డి, జీహెచ్ఎంలు వేణు మాధవ్, శ్రీనివాస్, కన్నయ్య, ఉపాధ్యాయులు దేవీ ప్రసాద్, సీఆర్పీలు మహముద్, యుగేందర్, సురేఖ, అజీమ్, మౌనిక, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
