
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజ్‌ను ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి సందర్శించనున్నారు. సమ్మక్క సాగర్, దేవాదుల పంపు హౌస్ వద్ద మంత్రుల పర్యటన నేపథ్యంలో శనివారం ఏర్పాట్లను ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా సమ్మక్క బ్యారేజ్పరిశీలించిన అనంతరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కి పంపింగ్ స్టేషన్ ను క్షేత్రస్థాయిలో సందర్శిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.