కొండలు, గుట్టలకు రైతుబంధు ఇయ్యం : భట్టి విక్రమార్క

కొండలు, గుట్టలకు రైతుబంధు ఇయ్యం  : భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.  కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు.  మార్చి 09 వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు . గత బీఆర్ఎస్ హయాంలో యాసంగి రైతుబంధు 4 నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. గతంలో రైతుబంధును బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలలపాటు ఇచ్చిందని చెప్పారు.  ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నామని వెల్లడించారు. 

ఇంకా ఎవరైనా రైతులకు రైతుబంధు అందకుంటే ఈ నెలఖారులోపు కంప్లీట్ చేస్తామన్నారు భట్టి.  రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.  ఈనెల 12న మహిళలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభింస్తామని వెల్లడించారు.  సూక్ష్మ, చిన్న పరిశ్రమలు  పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.   స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.  

ALSO READ :- Byju's Crisis : డెడ్లైన్ దగ్గరకొచ్చింది..20వేల మంది ఉద్యోగుల జీతాలు లేనట్లేనా..?

గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదన్న మంత్రి.. తాము మార్చి 01 వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు.  ఈ నెల 11 న ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తామని, ప్రతి నియోజకవర్గంలో 3 వేల 500 ఇళ్లను శాంక్షన్ చేస్తామని స్పష్టం చేశారు.