సిద్దుల గుట్టకు పోటెత్తిన భక్తులు

సిద్దుల గుట్టకు పోటెత్తిన భక్తులు

ఆర్మూర్, వెలుగు :- - కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని ఆర్మూర్​ టౌన్​ లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే గిరి ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని  ప్రత్యేక పూజలు చేశారు.   గుట్టపై ఉన్న శివాలయం, రామాలయం, దుర్గామాత ఆలయంలో పురోహితులు కుమార్ శర్మ, నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో అభిషేకం, ప్రత్యేక పూజలు  చేశారు. 

రామాలయం నుంచి జీవ కోనేరు వరకు ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం గడ్డం లావణ్య, భూమారెడ్డి దంపతులు, సాంకేకర్ కల్పన, మహేశ్​దంపతులు, యామాద్రి ఈశ మనస్విని ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.