
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి గురువారం రంగారెడ్డి జిల్లా కూకట్పల్లికి చెందిన నాయినేని కృష్ణారావు, కౌసల్య దంపతులు వివిధ పూజల నిమిత్తం రూ.3.52లక్షల విరాళాన్ని ఈవో రమాదేవి చేతుల మీదుగా అందజేశారు. ఆలయంలో పూజలనంతరం వారు ఈ విరాళాన్ని ఇచ్చారు. కాగా సీతారామచంద్రస్వామికి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించారు.
కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం చేశారు. కంకణాలు ధరించిన భక్తులు క్రతువు నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.