
కోలీవుడ్ హీరో ధనుష్ టాలీవుడ్ నటిస్తున్న చిత్రం ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘అటెండెన్స్ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్‌లో ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెబుతున్నా’ అంటూ ధనుష్ చెప్పె డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ‘సార్’ను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో బాల గంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్‌గా ధనుష్ నటిస్తున్నాడు. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.