మానవత్వం లేదా : నీకు షుగర్ ఉందా.. అయితే ఉద్యోగానికి ఫిట్ కాదు అంటూ తొలగింపు

మానవత్వం లేదా : నీకు షుగర్ ఉందా.. అయితే ఉద్యోగానికి ఫిట్ కాదు అంటూ తొలగింపు

రోజు రోజుకు మానవత్వం మరీ పాతాళానికి పడిపోతుంది.. ఓ మహిళకు షుగర్ వ్యాధి ఉందని.. ఉద్యోగానికి ఫిట్ కాదంటూ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది మరీ టూమచ్ అంటూ నెటిజన్లు అందరూ ఆమెకు మద్దతుగా నిలబడటం ఒకటి అయితే.. యాజమాన్యం ఇంత క్రూరంగా వ్యవహరించటం అనేది దుర్మార్గం అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

 షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని.. ఆరోగ్యం బాగోలేదని.. తన షిఫ్ట్ నుంచి ముందుగా వెళ్లిపోయినందుకు ఇలా చేయటం ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మన దేశంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు చూద్దాం..

నాన్సీ అనే మహిళ కటింగ్ షాపులో పని చేస్తుంది. ఉన్నట్టుంది ఒకరోజు ఆమెకు షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగిపోయాయి. దీంతో నాన్సీకి కళ్లు తిరిగినట్టు అనిపించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకునో లేక షుగర్ టాబ్లెట్ వేసుకుని వద్దం అనుకుందో ఏమో కానీ బాస్ కు చెప్పకుండానే వెళ్లిపోయింది. బాస్ వచ్చి షాపులో చూడగా వర్కర్ కనిపించకపోవడంతో చిరాకు పడ్డాడు. 

ఆమెను వెంటనే పనిలో నుంచి తీసేస్తున్నానను అని మెసేజ్ పెట్టాడు. దానికి మహిళ చింతిస్తూ బాస్ కు రిప్లే ఇచ్చింది. "తాను 506 బ్లడ్ షుగర్‌తో మంచం మీద ఉన్నానని.. చెప్పకుండా వచ్చినందుకు తీవ్ర ఆందోళన చెందుతున్నానని చెప్పింది. నేను ఆఫీసుకు వచ్చి అంతా చెబుతామని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరం. నేను చెప్పింది కూడా నమ్మడానికి మీరు సిద్ధంగా లేరని అర్థమౌతుంది.. భవిష్యత్తులో ఏదైన రోగాలు ఉన్నవారిని తీసుకోకండి వారి జీవితాలు నాశనం చేయకండని సూచించిది. 

ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ బాస్ పై కోపడుతూ కామెంట్ చేస్తున్నారు. ఒక ఎంప్లాయ్ వర్క్ మధ్యలో వదిలేసి వెళ్లరు అలాంటిది ఎంత అర్జెంట్ అయితే వెళ్లుంటుంది ఒకసారి ఆలోచించండని ఫైర్ అవుతున్నారు.