- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు: విద్యార్థులకు అకాడమిక్ విద్య తో పాటు, ఒకేషనల్ కోర్సులు, సృజనాత్మకత అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్గొండ రాంనగర్ లో సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ఒకేషనల్ ట్రైనింగ్ పై విద్యార్థినులకు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని జూనియర్ కాలేజీలు, 9 , 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు సెట్విన్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
డీఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ,జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, డీఈఓ బిక్షపతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్,సెట్విన్ ప్రతినిధి రేణుక, ప్రిన్సిపల్ కుబ్రా ,జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, పాల్గొన్నారు.
పత్తి కొనుగోలు చేయాలి
పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం నల్గొండ లోని కలెక్టరేట్లోని తన చాంబర్లో మార్కెటింగ్, సీసీఐ అధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యాజమానులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు పూర్తిగా సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున నిబంధనల సడలింపులు తన పరిధిలో లేదని తెలిపారు.
