
రేగొండ/ గూడూరు/ హసన్‌పర్తి/ జనగామ అర్బన్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్లు, ఆస్పత్రులను ఆయా జిల్లాల కలెక్టర్లు బుధవారం తనిఖీలు చేశారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా రేగొండ మహాత్మాజ్యోతి బాపూలే గురుకులాన్ని ఆ జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, మహబూబాబాద్ జిల్లా గూడూరు పీహెచ్సీ, కేజీబీవీ, జడ్పీహెచ్ఎస్ను కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పీహెచ్సీ, ఎమ్మార్వో ఆఫీస్, కేజీబీవీని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా వారు విద్యార్థులకు అందుతున్న భోజనం, విద్యపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో రికార్డులను పరిశీలించి, సీజనల్ వ్యాధుల పై అలర్ట్‌గా ఉండాలని, నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. జనగామ మండలం చౌడారం తెలంగాణ ప్రభుత్వ బాలికల మోడల్ స్కూల్‌ను అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ సందర్శించారు. రాష్ట్రీయ బాల్ స్వస్తియ కార్యక్రమం కింద విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పర్యవేక్షించారు.