
దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో అమెరికాలోని న్యూయార్క్‌లో హెచ్.పి.బ్లావట్స్కి, ఎంఎస్ అల్కాట్, విలియం క్వాన్ జడ్జ్‌లు స్థాపించారు. 1882లో దివ్య జ్ఞాన సమాజం అంతర్జాతీయ కార్యాలయాన్ని మద్రాస్‌లోని అడయార్‌కు మార్చారు. ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు ఆల్కాట్, రెండో, చివరి అధ్యక్షురాలు అనీబిసెంట్. ఈ సమాజ ప్రధాన లక్ష్యం మానవ సేవ. ప్రాచీన మతాలైన హిందూ, బౌద్ధ, జుడాయిజం మతాల సమ్మేళనం కోసం దివ్యజ్ఞాన సమాజం ప్రయత్నించింది.
ముఖ్య ఉద్దేశాలు: విశ్వమావన సౌభ్రాతృత్వం, అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం. ప్రకృతి, మానవుని లోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి.
నమ్మకాలు: పునర్జన్మను నమ్మింది, ఉపనిషత్, సాంఖ్య, యోగా, వేదాంతాల నుంచి స్పూర్తి పొందింది.
అనీబిసెంట్
ఈమె ఐర్లాండ్‌కు చెందిన ఐరిష్ జాతి మహిళ. అయితే ఈమె లండన్‌లో జన్మించింది. అసలు పేరు అనీవుడ్. ఈమెన్ డైమండ్ సోల్‌గా అభివర్ణిస్తారు. హెచ్.పి. బ్లావట్స్కి రహస్య సిద్ధాంతం అనే వ్యాసాన్ని చదివి ప్రభావితమైన అనీబిసెంట్ 1888 లండన్‌లో దివ్యజ్ఞాన సమాజంలో చేరింది. 1893లో ఇండియాకు వచ్చింది. కల్నల్ ఆల్కాట్ మరణానంతరం 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అనీబిసెంట్ అధ్యక్షత వహించింది.
ఈమె 1916లో చిత్తూర్‌లోని మదనపల్లెలో బిసెంట్ థియోసఫికల్ కాలేజ్(జాతీయ కళాశాల)ను స్థాపించింది. దీని మొదటి ప్రిన్సిపల్ హెచ్.జె. కజిన్స్. 1898లో వారణాసిలో కేంద్ర హిందూ కళాశాలను నెలకొల్పగా, 1916లో మదన్మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చాడు. ఇక్కడ హిందూ మతం, పాశ్చాత్య శాస్త్రీయ సబ్జెక్టులను బోధించేవారు.