కామారెడ్డిటౌన్, వెలుగు : విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకావొద్దని జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ రమణ పేర్కొన్నారు. మంగళవారం ఆరోగ్య, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీనేజీ వయస్సులో వచ్చే అవరోధాలను జయిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఎక్సైజ్ సీఐ సంపత్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఇర్పాన, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత, సైక్రియాటిక్ సోషల్ వర్కర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
