ఆరోగ్య తెలంగాణే మా భూమి రథయాత్ర లక్ష్యం : విశారదన్ మహరాజ్

ఆరోగ్య తెలంగాణే మా భూమి రథయాత్ర లక్ష్యం : విశారదన్ మహరాజ్

బజార్ హత్నూర్, వెలుగు: ఆరోగ్య తెలంగాణే మా భూమి రథయాత్ర లక్ష్యమని.. అందులో భాగంగానే ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీల హాస్టళ్ల నిర్వహణ తీరును పరిశీలిస్తున్నామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. పాదయాత్ర బుధవారం బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చేరుకున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేపట్టినట్లు చెప్పారు. 

రాష్ట్రంలో10 శాతం లేని రెడ్డి, రావులు తెలంగాణాలో అధికారాన్ని శాసిస్తున్నారని.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికారం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని కలెక్టర్లు, సీఎంతో పరిష్కరించేలా 12వేల గ్రామాల్లో వినతి పత్రాలు స్వీకరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బజార్ హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి  వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జేఏసీ రాష్ట్ర నేత అన్నెల లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్, మండల అధ్యక్షులు సర్కిల్ నరేశ్, ఒడ్డేపల్లి గంగయ్య, సోనాల అధ్యక్షులు కొండపాక గణేశ్ తదితరులు పాల్గొన్నారు.