తెలంగాణ యూనివర్సిటీలో చిత్రలేఖనం పోటీలు

తెలంగాణ యూనివర్సిటీలో చిత్రలేఖనం పోటీలు

నిజామాబాద్ రూరల్, వెలుగు : సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ యూనివర్సిటీలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. భారత ప్రభుత్వం,  యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. యూనివర్సిటీ విద్యార్ధులతో పాటు డిగ్రీ కాలేజీలు, తెలంగాణ గిరిజన సంక్షేమ కాలేజీలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొని  సర్దార్​ పటేల్​ జీవిత స్ఫూర్తి,  ఆయన సందేశాలు ప్రతిబింబించే అంశాలపై చిత్రాలు గీశారు. 

ఉక్కు సంకల్పం, ఏక్ భారత్, ఆత్మనిర్బర్ భారత్, ఏకీకృత భారతావని తదితర అంశాలపై సృజనాత్మకమైన బొమ్మలు వేశారు.  కార్యక్రమంలో ప్రోగ్రామ్​ ఆఫీసర్లు డా:ఎన్​స్వప్న, స్రవంతి, అహ్మద్​అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.